ఈ మ్యాచ్ నాకు చాలా ప్రత్యేకం : అయర్

by Anukaran |
ఈ మ్యాచ్ నాకు చాలా ప్రత్యేకం : అయర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో కోల్‌కతాతో ఆదివారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లకు ఢిల్లీ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగుతూ.. పరుగుల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌ అనంతరం ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ… ‘ఈ మైదానంలో పెద్ద టార్గెట్లను కూడా కాపాడుకోవడం చాలా కష్టం. ఆ విషయం తెలిసి ముందే భారీ స్కోర్ సాధించాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఇదే మైదానంలో అండర్-19 ఆడిన అనుభవం కలిసివచ్చింది. అందుకే స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలినాను. కోల్‌కతా బ్యాట్‌మెట్‌లు కూడా టార్గెట్ చేరుకుంటారనే అనిపించినా…. మా బౌటర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్ నాకు చాలా ప్రత్యేకమైనది అని శ్రేయస్ అయర్ అన్నారు.

Advertisement

Next Story