రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. 9th స్టూడెంట్ టాలెంట్!

by Shyam |
Royal Enfield
X

దిశ, ఫీచర్స్ : ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహనకు తోడు ఇంధన ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ బైక్స్‌కు డిమాండ్ పెరిగింది. ఈ మేరకు ప్రముఖ వెహికల్ మాన్యుఫాక్చరీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిసారిస్తు్న్నాయి. ఇదే క్రమంలో క్రియేటివిటీకి పదునుపెడుతున్న కొందరు వ్యక్తులు అందుబాటులో ఉన్న ఎక్విప్‌మెంట్‌తోనే ఎలక్ట్రిక్ బైక్స్ రూపొందిస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన రజన్ శర్మ అనే 15 ఏళ్ల కుర్రాడు పాత రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్క్రాప్‌ను ఉపయోగించి e-బైక్ తయారుచేశాడు.

సుభాష్ నగర్‌లోని సర్వోదయ బాల విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న రజన్.. తన బైక్ ప్రాజెక్ట్ కోసం రూ. 45వేలు ఖర్చు చేశాడు. లాక్‌డౌన్ టైమ్‌లో పనిమొదలుపెట్టిన ఈ వండర్ కిడ్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కి.మీ ప్రయాణించే వెహికల్‌ను సిద్ధం చేశాడు. మొదట్లో రెండుసార్లు ఫెయిలవడంతో అతడి తండ్రి దశరథ్ శర్మ వద్దని వారించాడు. అయినా తన స్కూల్ ప్రాజెక్ట్‌ కూడా ఎలక్ట్రిక్ బైక్ ప్రాజెక్టుకు దగ్గరగా ఉండటంతో అలాగే కంటిన్యూ చేశాడు. అలా ఫ్రెండ్స్, బంధువుల గైడెన్స్‌తో పాటు ఆర్థిక సాయాన్ని పొందిన రజన్.. యూట్యూబ్‌లో e-బైక్‌ల గురించి సమాచారాన్ని సేకరిస్తూ మూడు నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు.

రజన్ తయారుచేసిన e-బైక్ హెడ్ లైట్, ఫ్రంట్ లుక్ మొత్తం ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ మాదిరిగానే ఉంది. పాత బైక్ ఇంజిన్‌ ప్లేస్‌లో బ్యాటరీ అమర్చారు. గంటకు 50 కి.మీ వేగంతో వెళ్లేలా డిజైన్ చేసిన ఈ-బైక్‌పై హైవేస్‌లో గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణించవచ్చు. రజన్ సాధించిన విజయంపై స్పందించిన తండ్రి.. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎవరి సాయం లేకుండా తనే కంప్లీట్ చేశాడని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం e-బైక్ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన రజన్.. నెక్ట్స్ e-కార్ తయారుచేసేందుకు సిద్ధమవుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed