మూడెకరాల ‘భూ పంపిణీకి’ మంగళం ?

by Shyam |
మూడెకరాల ‘భూ పంపిణీకి’ మంగళం ?
X

– ఉమ్మడి జిల్లాలో 69 మందికే పంపిణీ

దిశ, రంగారెడ్డి : దళితులకు మూడెకరాల భూపంపిణీ అంశాన్ని 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటించిన టీఆర్‌ఎస్..అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకుందా..అంటే లేదనే చెప్పాలి. అందుబాటులో ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూమిని పంపిణీ చేసి ‘మమ’ అనిపించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక పోవడంతో.. ప్రభుత్వం ఇక ఈ పథకానికి ‘మంగళం పాడినట్టేనా’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేవం 69 మందికే పంపిణీ..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విడతల వారీగా భూ పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మొదటి విడతలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 366 మంది లబ్దిదారులకు 1,098 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని అధికారులు గుర్తించారు. అంతేకాదు ఈ భూమి సాగుకు యోగ్యమై ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. అయితే భూమి అందుబాటులో లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఎకరాకు రూ.6 లక్షల చొప్పున వెచ్చించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్​అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు కేవలం 69 మంది లబ్దిదారులకు మాత్రమే భూ పంపిణీ చేసి అధికారులు చేతులెత్తేశారు.

అప్పుడు తెలియదా..?

జిల్లాలో భూముల ధరలు ఆకాశన్నంటుతుండటంతో భూ పంపిణీ చేయలేమని జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ శివారులో భూమిని కొనుగోలు చేయాలన్నా..ఎకరాకు సుమారుగా రూ.30 లక్షలకు పైమాటే. ఈ పరిస్థితుల్లో ఎకరాకు రూ.6 లక్షలతో కొనుగోలు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ? టీఆర్ఎస్​అధికారంలోకి రాకముందు జిల్లాలో భూముల ధరలు తక్కువలో తక్కువ రూ.10 – 15 లక్షల మధ్యే ఉన్నాయి. టీఆర్ఎస్​అధికారంలోకి వచ్చిన తర్వాతనే భూముల ధరలకు రెక్కలు వచ్చాయనే విషయమూ తెలిసిందే.

భూ మాయకు మద్ధతు..

రాష్ట్రంలో ప్రభుత్వ భూమిని కాజేస్తున్న కబ్జాదారులకు పాలకులు మద్ధతు తెలుపుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అసైన్డ్, వక్ఫ్‌, భూదాన్​భూములను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి దళితులకు భూపంపిణీ చేసే అవకాశమున్నా..పాలకులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed