- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖాసీంపూర్ తండాలో కిటికీ ఊచలకు వేలాడిన విద్యార్థిని..
దిశ, రామాయంపేట : అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజాక్ పల్లి పంచాయతీ పరిధిలోని ఖాసీంపూర్ తండాలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఖాసీంపూర్ తండాకు చెందిన లావుడ్య నాజం, బుజ్జిలకు ఇద్దరు కుమారులు, కూతురు నీరజ (18) కలరు. మృతురాలు డిగ్రీ మెదటి సంవత్సరం చదువుతోంది. తల్లి బుజ్జి గతంలో ఆత్మహత్య చేసుకుంది. అయితే, గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్దలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో కిటికీ ఊచలకు నీరజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చుట్టు పక్కల ప్రజలకు గుర్తించి తండా వాసులకు తెలిపారు. ఆ సమయంలో మృతురాలి కాళ్లు నేలను తాకుతున్నాయి. మృతురాలి అమ్మమ్మ ఊరు అయిన నగరం తండావాసులు ఖాసీంపూర్‌కు చేరుకుని నీరజ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నీరజ మృతికి గల కారణాలపై ఆరా తీశారు. తల్లి తరుఫు బంధువులు పోస్టుమార్టం నిర్వహించకుండా కాసేపు అడ్డుకున్నారు. ఎస్సై ప్రకాశ్ గౌడ్ చొరవతో సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. మృతురాలి మేనమామ గేమ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రకాశ్ గౌడ్ తెలిపారు. కాగా, నీరజ మృతికి గల వివరాలు తెలియాల్సిఉంది.