ఇంత సెక్సీగా ఎలా ఉన్నారు?..హీరో ప్రశ్నకు షాకైన మరో హీరో

by Shyam |
ఇంత సెక్సీగా ఎలా ఉన్నారు?..హీరో ప్రశ్నకు షాకైన మరో హీరో
X

దిశ, సినిమా : డిఫరెంట్ స్టైలింగ్‌తో యూనిక్ ఫ్యాషన్‌‌కు కేరాఫ్‌గా కనిపించే బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్.. తాజాగా ‘ఆస్క్ మి ఎనీథింగ్(AMA) సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైఫ్ దీపికా పదుకొనేతో పాటు టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలిచ్చి అభిమానులను ఖుషీ చేశాడు. యాక్టర్ అర్జున్ కపూర్ ‘ఇంత సెక్సీగా ఎలా ఉన్నారు బాబా?’ అని అడిగితే.. ఇదంతా నీ ట్రైనింగే అని రిప్లయ్ ఇచ్చాడు. ఇక తనను ‘బీస్ట్’గా పోల్చిన టైగర్ ష్రాఫ్‌కు ‘ఆదివారం ఉదయం చేసిన స్కౌట్స్.. బ్రదర్ టైగర్‌కు అంకితం ఇస్తాను’ అని బదులిచ్చాడు. ఫైనల్‌గా దీపిక, రణ్‌వీర్ కన్వర్జేషన్ ఈ సెషన్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇంటికి ఎప్పుడొస్తున్నావని దీపిక అడిగితే.. ‘ఫుడ్ వేడిచేయి బేబీ వచ్చేస్తున్నా’ అంటూ కిస్ ఎమోజీస్‌ యాడ్ చేశాడు. ఇదే క్రమంలో ఒక ఫ్యాన్ దీపికను ఒకే పదంలో వర్ణించమని కోరగా.. ‘క్వీన్‌’ అంటూ క్విక్ రిప్లయ్ ఇవ్వడం విశేషం.

Advertisement

Next Story