నాన్నే గొప్ప ఆఫ్ స్క్రీన్ హీరో : దీపికా

by Jakkula Samataha |
నాన్నే గొప్ప ఆఫ్ స్క్రీన్ హీరో : దీపికా
X

‘ఒక అమ్మాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలంటే తల్లిదండ్రుల సపోర్ట్ చాలా అవసరం.. ఒడిదుడుకుల్లో కుటుంబం ఇచ్చే ధైర్యం, నమ్మకం, ప్రోత్సాహమే మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అని చెప్తోంది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె. అలాంటి భరోసా నాకు నా తండ్రి, మాజీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనె నుంచి లభించిందని చెప్తున్న దీపికా.. ‘నేను కలిగి ఉన్న గొప్ప ఆఫ్-స్క్రీన్ హీరో మా నాన్నే’ అని తెలిపింది. ‘నిజమైన చాంపియన్ అంటే వృత్తిపరమైన విజయాలు మాత్రమే కాదు.. మంచి మనిషిగా ఉండటం’ అని చూపించిన తండ్రికి ధన్యవాదాలు తెలిపింది. 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రకాశ్ పదుకొనెకు.. ‘లవ్ యూ పప్పా’ అంటూ విషెస్ తెలిపిన దీపికా.. తండ్రితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది.

కాగా ప్రస్తుతం భర్త రణ్‌వీర్ సింగ్‌తో క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్న దీపికా.. భర్తకు ఇష్టమైన వంటకాలు చేసి పెడుతూ ప్రేమగా చూసుకుంటోంది. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘83’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్ర చేస్తుండగా.. ఆయన భార్యగా దీపికా పదుకొనె కనిపించనుంది.

Advertisement

Next Story