కరోనాపై దీపిక షేర్ చేసిన ఫొటో వైరల్

by Ramesh Goud |
కరోనాపై దీపిక షేర్ చేసిన ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్లతోపాటు చాలామంది ప్రముఖులు జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు వాడడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జనాలకు దూరంగా ఉండడం, నివసిస్తున్న ప్రాంతం, చుట్టుపక్కలా పరిశుభ్రంగా ఉంచుకుంటూ తదితర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేసి, కరోనాపై జాగ్రత్తగా ఉండాలంటూ తన అభిమానులకు పలు సూచనలు చేసింది. దీంతో అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

tags : Deepika Padukone, instagrame, social media, photo, corona virus

Advertisement

Next Story

Most Viewed