షారుఖ్ ‘పఠాన్’ సెట్స్‌లో దీపిక

by Shyam |
షారుఖ్ ‘పఠాన్’ సెట్స్‌లో దీపిక
X

దిశ, వెబ్‌డెస్క్ :
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని ఫ్యాన్స్ సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. వీరిద్దరి కాంబినేషన్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాగా ఈ బ్లాక్ బస్టర్ జంట.. సిద్ధార్థ్ ఆనంద్ ‘పఠాన్’ సినిమా కోసం మరోసారి జతకడుతోంది. షారుఖ్ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయగా.. సోమవారం నుంచి దీపిక కూడా జాయిన్ అయిందని సమాచారం. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుగుతుండగా.. దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కాగా ఈ సినిమాలో జాన్ అబ్రహాం కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక దీపిక.. ఈ మధ్యే శకున్ బత్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది. గోవాలో జరిగిన లాస్ట్ షెడ్యూల్‌తో సినిమా పూర్తి కాగా.. ఈ చిత్రంలో అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది దీపిక.

Advertisement

Next Story