- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్న దీపికా
ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టి.. తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’లో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌తో జతకట్టి వావ్ అనిపించుకుంది దీపికా పదుకొనే. ఈ క్రమంలో ఒక్కో మెట్టూ ఎదుగుతూ బాలీవుడ్ సూపర్ మోస్ట్ టాలెంట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగలదని దర్శకులకు నమ్మకం కలిగించిన బ్యూటీ.. ‘రామ్ లీలా, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, చపాక్’ లాంటి సినిమాలతో అభిమానుల మనసు గెలుచుకుంది. హాలీవుడ్‌లోనూ XXX : Return of Xander Cage సినిమా చేసిన దీపికా.. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు పొందింది. 2018లో ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్’ లిస్ట్‌లో చోటు సంపాదించిన దీపికా.. తాజాగా ‘మూడ్ ఆఫ్ ది నేషన్ 2020’ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల లిస్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. మీడియా సంస్థ నిర్వహించిన పోల్‌లో దీపికా 16 శాతం ఓట్లు సాధించగా.. 14 శాతం ఓట్లతో ప్రియాంక సెండ్ ప్లేస్‌లో నిలిచింది. కత్రినా కైఫ్ థర్డ్ ప్లేస్, ఐశ్వర్య రాయ్ ఫోర్త్ ప్లేస్, అనుష్క శర్మ ఐదో ప్లేస్‌లో నిలవగా.. ఆరో స్థానంలో కంగనా రనౌత్, అలియా భట్ నిలిచారు.
అటు హీరోల లిస్ట్‌లో అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలవగా.. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వరుసగా తర్వాతి ప్లేస్ దక్కించుకున్నారు.
కాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా.. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.