- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపికా ఇన్‌స్టా ఫ్యామిలీ@ 50M
బాలీవుడ్ దివా దీపికా పదుకొనె.. రికార్డ్ క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ ఫాలోవర్స్ పొందిన మూడో ఇండియన్‌గా నిలిచింది. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాలు ఇప్పటికే 5 కోట్ల ఫాలోవర్స్‌తో ముందు వరుసలో ఉండగా.. మంగళవారం దీపికా కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన దీపిక.. ఈ మైల్ స్టోన్‌ను చేరుకున్నందుకు గ్రేట్ ఫుల్‌గా ఫీలవుతున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫ్యాన్స్ అప్రిసియేషన్ పోస్ట్‌లను రీపోస్ట్ చేసింది.
కాగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపిక.. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. సినిమాల అప్‌డేట్స్ ఇస్తూనే.. మ్యాగజిన్ కవర్ పేజీలపై మెరుస్తున్న వివరాలు కూడా అందించే ఈ భామ.. పెయిడ్ పార్ట్‌నర్ షిప్స్‌తో భారీ ఆదాయం పొందుతోంది. పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తోంది.