దీపక్ కొచ్చర్ అరెస్ట్

by Shamantha N |
దీపక్ కొచ్చర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్ మధ్య లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.1,875 కోట్ల రుణాలను మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఈడీ గత ఏడాదిలో పీఎంఎల్ఎ కింద చందాకొచ్చర్, వీడియో కాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్ ధూత్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతరాత్రి దీపక్‌ కొచ్చర్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మంగళవారం నుంచి విచారించనున్నారు.

Advertisement

Next Story