- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నన్ను త్వరలో మైదానంలో చూస్తారు’
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ (IPL) కోసం యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు దీపక్ చాహర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన 13 మంది సీఎస్కే (CSK) సభ్యుల్లో అతడు ఒకడు. తాజాగా స్పందించిన చాహర్ తాను కరోనా నుంచి కోలుకుంటున్నట్లు చెప్పాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మైదానంలోకి అడుగుపెడతానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
సీఎస్కే యాజమాన్యం నిర్వహించిన పరీక్షలో చాహర్ సహా మిగతా 12 మంది కరోనా నెగెటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలో చాహర్ వీడియోను సీఎస్కే సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ‘నేను కోలుకున్నాను. ఫిట్‌గా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నా. త్వరలోనే నన్ను మళ్లీ మైదానంలో చూస్తారు. నాకోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’ అని చాహర్ వీడియోలో పేర్కొన్నాడు. గత ఏడాది వెస్టిండీస్ సిరీస్ సమయంలోనే చాహర్ గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత టీమ్ ఇండియాకు దూరం అయ్యాడు. గాయం నుంచి కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (National Cricket Academy)లో పునరావాసం తీసుకున్నాడు. కరోనా అనంతరం ఐపీఎల్‌లో ఆడటానికి యూఏఈ వెళ్లిన చాహర్ అనూహ్యంగా కరోనా బారిన పడటం అటు సీఎస్కే యాజమాన్యంతో పాటు బీసీసీఐ (BCCI)ని కలవరపెట్టింది.