- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెలీగ్రామ్‌తో జాగ్రత్త.. నగ్నఫొటోలు వస్తున్నాయట!
దిశ, వెబ్‌డెస్క్ : ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి టెలీగ్రామ్ మెసేజింగ్ యాప్‌ను ఒక వారధిగా ఉపయోగిస్తున్నారు. సినిమాల డౌన్‌లోడ్, పోర్న్ వీడియోలు, బెట్టింగ్‌లు, డ్రగ్స్.. ఇలా అన్ని రకాల పాడుపనులు టెలీగ్రామ్ ద్వారా జరుగుతున్నాయి. వీటికి ఊతమిచ్చే ఆటోమేటిక్ బోట్‌లు టెలీగ్రామ్‌లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ అల్గారిథమ్ ద్వారా పనిచేసే బోట్‌లలో ప్రమాదకరమైన దాన్ని పరిశోధకులు ఇటీవలే గుర్తించారు. సెన్సిటీ అనే సంస్థలో పనిచేసే ఈ పరిశోధకులు టెలీగ్రామ్‌లో ఉన్న డీప్ ఫేక్ బోట్‌ల గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా సాధారణ చిత్రాలను నగ్న చిత్రాలుగా మార్చే డీప్ న్యూడ్ అనే బోట్ గురించి వీరు కనుక్కున్నారు.
ఇప్పటికే ఈ బోట్ ద్వారా లక్ష మందికి పైగా అమ్మాయిల డీప్ ఫేక్ నగ్న ఫొటోలు వివిధ టెలీగ్రామ్ చానళ్లలో చక్కర్లు కొడుతున్నాయని సెన్సీటీ సంస్థ వెల్లడించింది. ఈ టెలీగ్రామ్ చానళ్లు ప్రధానంగా రష్యా, దాని పక్క దేశాల నుంచి పుట్టుకొచ్చాయని, అమ్మాయిల ఫొటోలను డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా నగ్నంగా మార్చి, వాటిని అమ్మకానికి కూడా పెడుతున్నారని ఈ సంస్థ తెలిపింది. ముఖ్యంగా చిన్నపిల్లల డీప్ ఫేక్ నగ్న ఫొటోలను మార్కెట్ చేసుకుంటున్నారని వెల్లడించింది. అయితే ఇలా చేస్తున్న డీప్ ఫేక్ బోట్‌లను ఎవరు తయారు చేశారనే దాని గురించి స్పష్టత లేకపోయినా, అందరు యూజర్‌లకు ఇవి ఉచితంగా లభ్యమవుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ డీప్ న్యూడ్ బోట్‌ను నాశనం చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది ఏదో ఒక రూపంలో టెలీగ్రామ్‌లో ప్రత్యక్షమవుతోందని, అందుకే టెలీగ్రామ్ ఉపయోగించే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సెన్సిటీ సంస్థ పరిశోధకులు సలహా ఇచ్చారు.