దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే ?

by vinod kumar |   ( Updated:2021-06-28 01:10:56.0  )
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు సంఖ్య నిన్నటితో పోలిస్తే ఈ రోజు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 46,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది. ఇక నిన్న కరోనాతో 979మృతి చెందారు. అదే సమయంలో కరోనా నుంచి 58,578 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు2,93,09,607 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,96,730 కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతంలో 5,72,994 కేసులుఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story