నల్గొండ మైనింగ్ క్వారీలో కుళ్లిపోయిన మృతదేహం..

by Sumithra |
నల్గొండ మైనింగ్ క్వారీలో కుళ్లిపోయిన మృతదేహం..
X

దిశ, దామరచర్ల : నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని వాడపల్లి శివారు ఐసీఎల్ ఫ్యాక్టరీకి చెందిన మైనింగ్ క్వారీలో బుధవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు భిక్షాటన చేసుకునే వ్యక్తిగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. 20 నుంచి 30 రోజుల కిందట ఆ వృద్ధుడు చనిపోయినట్టుగా తెలుస్తుందన్నారు. చనిపోయిన వృద్ధుడి వయస్సు సుమారు 65 నుంచి 70 ఏళ్లు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. మృతదేహం మొత్తం కుళ్లిపోయిన స్టేజీలో ఉందన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Next Story