కిడారి, సోమ హంతకుడి లొంగుబాటు

by srinivas |
కిడారి, సోమ హంతకుడి లొంగుబాటు
X

విశాఖపట్టణం జిల్లా అరకు దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మావోయిస్టు నేత సాంబ ఖరా అలియాస్ రణదేవ్ ఒడిశాలోని మల్కనగిరి ఎస్పీ ముందు లొంగిపోయాడు. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ మావోయిస్టు మిలటరీ ప్లాటూన్ సభ్యుడైన రణదేవ్ మరో 12 కేసుల్లో ప్రధాన నిందితుడు. ఇతనిపై ఒడిశా ప్రభుత్వం 2 లక్షల నజరానా ప్రకటించింది.

2018 సెప్టెంబర్ 23న అరకు మండలంలోని నిర్వహించిన గ్రామదర్శని కార్యక్రమంలో పాల్గొని లివిటిపుట్టు వద్దకు అప్పటి స్థానిక ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు అడ్డగించారు. గన్‌మన్లు వారిని కాల్చేందుకు సిద్ధపడగా, రాజేశ్వరావు వారిని అడ్డుకున్నాడు. వారిని రౌండప్ చేసిన మావోలు వారిని కారు దించి నడిపించుకుని తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారు చెప్పినట్టు వింటానని..కాల్చవద్దని ఎమ్మెల్యే ప్రాధేయపడినా వినలేదు.

కోట్లు తీసుకుని పార్టీ మారావు ఆ డబ్బులు సరిపోలేదా? అరకు, పాడేరుల్లోని బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వానికి మద్దతిస్తున్నావు? అంటూ నిలదీశారు. తవ్వకాలకు దూరంగా ఉంటాను.. రోడ్డు వేయడాన్ని అడ్డుకుంటాను… కాల్చవద్దు అంటున్నా.. నీకు చాలా అవకాశాలిచ్చాం. కానీ గిరిజను ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమ్ముడు పోతున్నావు అంటూ అతనిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మంచివాడుగా, విలువలకు కట్టుబడ్డ వ్యక్తిగా పేరొందిన సివేరి సోమను కూడా హతమార్చారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యక్ష సాక్షులను విచారించి, ఈ కేసులో ప్రధాన నిందితులు రణదేవ్, కామేశ్వరి, అరుణలు ప్రధాన నిందితులుగా భావించింది. అప్పటి నుంచి వారి కోసం గాలింపు చేపట్టింది. తప్పించుకు తిరుగుతున్న రణదేవ్ ఇన్నాళ్టికి లొంగిపోవడం విశేషం.

Tags : maoists, ranadev, samba khara, kameswari, aruna, siveri soma, kidari sarveswararao

Advertisement

Next Story

Most Viewed