అప్పులు తీర్చలేక రైతు మృతి

by Shyam |
farmer suicide
X

దిశ, మునుగోడు: పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మునుగోడుకు చెందిన ఎరుకొండ యాదయ్య (50) నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందాడు. పంటకు తెచ్చిన అప్పులు తీర్చలేనని మనస్థాపం చెంది మంగళవారం ఉదయం పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Next Story