నిర్భయ దోషులకు డెత్ డేట్ ఫిక్స్

by Sumithra |   ( Updated:2020-03-18 01:07:25.0  )
నిర్భయ దోషులకు డెత్ డేట్ ఫిక్స్
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరి నుంచి తప్పించుకునే అన్నీ మార్గాలూ మూసుకుపోయాయి. నలుగురు దోషులకు మరణశిక్ష ఖరారు అయ్యింది. ఢిల్లీలోని తీహార్ జైలులో ఈ నెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నిర్భయ కేసు దోషులకు ఉరితీయాలని ఆదేశాలు జారీ చేశారు. మరణశిక్ష ఖరారు కావడంతో జైలు అధికారులు ఈ రోజు నాలుగు డమ్మీ బొమ్మలతో ఉరిశిక్ష నిర్వహించారు. మరణ శిక్షనుంచి తప్పించుకునేందుకు దొరికిన ప్రతీ ఎత్తునూ దోషులు వినియోగించుకున్నారు. నలుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు తమకున్న అవకాశాలను వినియోగించుకుంటూ ఉరి శిక్షనుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి ఆశలు, ఎత్తులు ఏ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమయంలో నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ కోరిన విషయం తెలసిందే. ‘‘అత్యాచారం కేసులో నిర్దోషి అయిన నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండాలనుకోవడం లేదు’’ అంటూ ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌పై రేపు (మార్చి 19)న విచారణ జరిగే అవకాశం ఉంది.
Tags : death, final to nirbhaya convicts, delhi, court, rape case, jail

Advertisement

Next Story

Most Viewed