- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూట్యూబ్ గ్రాడ్యుయేషన్.. డియర్ క్లాస్ ఆఫ్ 2020
అన్నీ బాగుంటే.. ఈపాటికి చాలా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ వేడుకలు జరిగి విద్యార్థులంతా గ్రాడ్యుయేట్లు అయిపోయేవారు. కానీ, కరోనా పాండమిక్ నీళ్లు జల్లింది. అందుకే కరోనా సృష్టించిన ప్రతి సమస్యకు ఇంటర్నెట్ పరిష్కారం చూపించినట్లుగానే, ఈ సమస్యకు కూడా యూట్యూబ్ ఓ దారి చూపించింది. ‘డియర్ క్లాస్ ఆఫ్ 2020’ పేరుతో వర్చువల్ గ్రాడ్యుయేషన్ వేడుకను నిర్వహించింది. యూట్యూబ్ ఒరిజినల్స్‌లో భాగంగా దీన్ని ఆదివారం ప్రసారం చేసింది. అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఈ వేడుకకు సారథ్యం వహించగా లేడీ గాగా, బియోన్సే, టేలర్ స్విఫ్ట్, కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
ఇందులో పాల్గొన్న వారందరూ వారి వారి గ్రాడ్యుయేషన్ వేడుకను, వారి చదువుకు సాయపడిన వారిని, ప్రోత్సహించినవారిని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాలో ప్రధాన టాపిక్‌గా మారిన జార్జ్ ఫ్లాయిడ్ అంశం గురించి ఒబామా దంపతులు ప్రస్తావించారు. అలాగే కరోనా పాండమిక్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు బైగాటరీ, సెక్సిజమ్, రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ఇందులో జేజే అబ్రామ్స్, జాకీ ఐనా, రే ఆలెన్, స్టీఫెన్ కోల్బర్ట్, సిండీ క్రాఫోర్డ్, జిమ్మీ కెమ్మెల్, లైజా కోషీ, క్రిస్ పైన్, జెండేయా, బిల్లీ పోర్టర్, డెమీ లొవటో, సుందర్ పిచాయ్ వంటి ప్రముఖుల ఉపన్యాసాలు ఉన్నాయి. కాగా భారతదేశం నుంచి యూట్యూబర్ ప్రాజక్తా కొళీకి ‘డియర్ క్లాస్ ఆఫ్ 2020’లో ఉపన్యసించే అవకాశం దొరికింది.