వద్దని ఆదేశాలిచ్చిన వినరే..

by Shyam |
Ration shop
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ తో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలు ఆకలితో అల్లాడొద్దని ప్రభుత్వం ఒక్కరికి 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ బియ్యం రేషన్ కార్డ్ ఉంటే చాలు… అదే నెలవారీగా ఇచ్చే రేషన్ బియ్యం ఒక్కరికి 6 కేజీలు ఇస్తారు. సాధారణంగా అయితే ప్రతి నెలా తీసుకునే బియ్యానికి వేలిముద్ర లేకుండా ఇవ్వరు. కానీ, ఈ వైరస్ నేపథ్యంలో ప్రత్యేకంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కేజీలు ఇస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు ఇచ్చే కరోనా, నెలవారీ బియ్యం పంపిణీ కార్డు చూసి ఇవ్వాలి. కానీ, రేషన్ డీలర్ల మాత్రం ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు. వేలిముద్రలు రాకుంటే వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రంగారెడ్డి జిల్లాలోని యాచారం, మంచాల, కందుకూరు, ఆమన్ గల్ మండలంలో కనిపిస్తున్నాయి. రోజుకు 20 మందికి పైనే లబ్ధిదారులు రేషన్ షాప్ వద్ద లైన్లో నిలబడి వేలిముద్రలు పడకపోవడంతో వెనుదిరుగుతున్నారు.

వేలిముద్రలతో వైరస్ రాదా?

రేషన్ షాపులో ఈ-పాస్ యంత్రాలపై వేలిముద్రలు తీసుకుని బియ్యం ఇస్తున్నారు. జనాలు సామాజిక దూరం పాటించడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి చెందడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ నిర్మూలనకు లాక్ డౌన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. కానీ, వేలిముద్రలు వేపించడంతో లాక్ డౌన్ నిబంధనలకు ప్రయోజనం లేకుండా పోయింది. శనివారం పౌరసరఫరాల శాఖ మంత్రి వేలిముద్రలు లేకుండా రేషన్ ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ డీలర్లు అవేమీ పట్టించుకోకుండా వ్యవరిస్తున్నారు.

ఇబ్బంది పడుతున్న వృద్ధులు….

జిల్లాలో 524887 కార్డులకుగానూ 17,48,545 లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో లక్ష మందికి పైగా వృద్ధులు ఉన్నారు. వీరి వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. యాచారం మండలం సింగారం గ్రామంలోని మల్లమ్మ అనే వృద్ధురాలు గత మూడు రోజులుగా వేలిముద్రలు పడకపోవడంతో బియ్యం తీసుకోలేకపోతున్నది. ప్రజాప్రతినిధుల సహాయంతో బియ్యం తీసుకుంది. ఇలాంటి పరిస్థితి అందరికి లేకపోవచ్చు. కానీ, చాలామంది వృద్ధులు బియ్యం రాక అవస్థలు పడుతున్నారు.

Tags: Ration dealers, beneficiaries, Sangareddy, government, authorities, orders

Advertisement

Next Story

Most Viewed