సచివాలయ టెండర్ల దాఖలు గడువు పొడిగింపు !

by Shyam |
సచివాలయ టెండర్ల దాఖలు గడువు పొడిగింపు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం నిర్మాణ పనుల టెండర్ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా తాజాగా వానలు, వరదలు, సెలవులతో మూడోసారి కూడా వాయిదా పడింది. తాజా వాయిదా ప్రకారం టెండర్లు దాఖలుకు తుది గడువు అక్టోబర్ 20 అని రోడ్లు భవనాల శాఖ స్పష్టం చేసింది. తొలుత నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 15వ తేదీకి టెండరు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంది. రూ. 400కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయం నిర్మాణానికి నిధులను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ ప్రకారమే రోడ్లు భవనాల శాఖ టెండర్ ప్రక్రియకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత అది రూ. 500 కోట్లకు పెంచుతూ టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కొన్నిరోజుల తర్వాత సచివాలయం డిజైన్, అదనపు నిర్మాణాల అవసరం, విస్తీర్ణం పెరగడం లాంటి మార్పులతో సవరణ చేయాల్సి వచ్చింది. ఆ ప్రకారం సవరించిన టెండర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంచనా వ్యయం రూ. 617 కోట్లకు పెరిగింది.

Advertisement

Next Story