అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

by Sumithra |   ( Updated:2021-09-01 11:23:44.0  )
unknown-bod
X

దిశ, కుత్బుల్లాపూర్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమేష్ కథనం ప్రకారం… గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మ గూడ సెయింట్ పీటర్స్ కళాశాల సమీపంలోని చెట్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తి (35-40) మృతదేహమున్నట్లు పశువుల కాపరి గుర్తించారు. కుక్కలు తింటుండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉంది. పశువుల కాపరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు. అయితే హత్యా.. ఆత్మాహత్యా..? అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Next Story