చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ సర్టిఫికెట్.. అయోమయంలో అధికారులు

by Shamantha N |
Covid-19 vaccine wastage:
X

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్రం సంఘటన జరిగింది. మరణించిన వ్యక్తి పేరు మీద వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ వచ్చింది. రాజ్‌గర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బియోర పట్టణంలో పురుషోత్తం శక్యవార్(78) గత మే నెలలో మరణించాడు. ఈ నెల 3న పురుషోత్తం రెండో డోసు టీకా తీసుకున్నట్లు సందేశం వచ్చింది. ఆయన కుమారుడు ఫూల్ సింగ్ శక్యవార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా పురుషోత్తం ఈ ఏడాది ఏప్రిల్ 8న మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నెలలోనే అనారోగ్య కారణాలతో మరణించారు. కాగా, ఈ విషయమై జాతీయ మీడియా జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ పిఎల్ భగోరియాను సంప్రదించగా, తనకు సమాచారం అందిందని, దీనిపై విచారిస్తున్నట్లు చెప్పారు. కంప్యూటర్‌లో లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే రాంచంద్ర డాంగీ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పు‌దోవ పట్టిస్తుందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed