నదిలో నటి మృతదేహం

by Anukaran |
నదిలో నటి మృతదేహం
X

దిశ, వెబ్ డెస్క్: కాలిఫోర్నియాలోని పేరూ లేక్ లో ఓ బోటును అద్దెకు తీసుకుని షికారుకు వెళ్లిన ప్రముఖ హాలీవుడ్ నటి నయా రివీరా(33) బోటులోంచి నదిలోకి దూకిన విషయం విధితమే. అయితే ఈ విషయమై బోటు యజమాని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గత ఐదు రోజులు గాలించారు. నిన్న సాయంత్రం నదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. అయితే .. రివీరా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తన తల్లితోపాటు వివాహర యాత్రకు వెళ్లిన రివీరా కొడుకు బోటులో ఒక్కడే ఉన్న విషయాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయమై అతడిని ఆరా తీయగా ‘అమ్మ,నేను కలిసి స్విమ్మింగ్ కు వెళ్లినాం. అయితే నేను తిరిగి వచ్చాను. కానీ, అమ్మ మాత్రం ఇంకా రాలేదు’ అని ఆ పిల్లాడు తెలియజేశాడు. అప్పటి నుంచి ఐదు రోజుల తర్వాత జల్లెడ పట్టగా నిన్న సాయంత్రం రివీరా మృతదేహం లభ్యమైంది. పలు ఇంగ్లీష్ మూవీస్ లలో నటించారు.

Advertisement

Next Story