- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖననం చేసిన మృతదేహం మాయం.. ఉలిక్కిపడ్డ జనం
దిశ, వెబ్‌డెస్క్ :
సాధారణంగా ఆస్పత్రిలో లేదా మార్చురీలో మృతదేహాలు తారుమారవుతుంటాయి. లేదా ఒక్కొసారి కనిపించకుండా పోతాయి. దీనంతటికి అక్కడి సిబ్బంది చొరవ కారణం అని తెలుస్తోంది. కానీ, ఖననం చేసిన ఓ వృద్ధుడి మృతదేహం 5 నెలల తర్వాత అదృశ్యమైంది. ఈ ఉదంతం కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, ఆ డెడ్‌బాడీ ఎక్కడికి వెళ్లిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోజుకో పుకార్లు పడుతుండటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. మోగ్లా తాలుకా రూగి గ్రామానికి చెందిన తిరమరట్టి రామప్ప(63) అనే వృద్ధుడు ఫిబ్రవరి 21న చనిపోయాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే ఆయన మృతదేహాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు.
సీన్ కట్ చేస్తే.. ఐదు నెలల తర్వాత సమాధి నుంచి శవం మాయమైంది. ఇటీవల కురిసిన వర్షానికి ఆ సమాధి గుంతలో నీళ్లు నిండుకున్నాయి. అది గమనించి స్థానికులు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూస్తే అందులో మృతదేహం లేదు. ఎవరో సమాధిని తవ్వి మృతదేహాన్ని తీసుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. సోమవారం అమావాస్య సందర్భంగా గుర్తు తెలయని వ్యక్తులు శవాన్ని తీసుకెళ్లినట్లు అక్కడి వారు భావిస్తున్నారు. క్షుద్రపూజలు చేసే వారే మృతదేహాన్ని తవ్వితీశారని పలువురు అనుమానిస్తున్నారు. గుప్త నిధులను కనిపెట్టడంలో శవం సాయం చేస్తుందన్న మూఢవిశ్వాసంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాధి నుంచి శవం మాయమైందన్న వార్తతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.