- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యభిచారాన్ని కూడా ప్రమోట్ చేస్తున్న జస్ట్ డయల్..
దిశ, ఫీచర్స్ : ‘జస్ట్ డయల్’ ప్రతీ సర్వీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను క్షణాల్లో అందిస్తుంది. ఈ క్రమంలోనే వ్యభిచారాన్ని కూడా ప్రమోట్ చేస్తోంది. జస్ట్ డయల్ లిస్టులో ఉన్న ‘స్పా’ సెంటర్స్‌కు ఫోన్ చేస్తే.. వారి సర్వీసులు ‘స్పా’ కోసమే కాక ఆటోమేటిక్‌గా సెక్స్ రిక్వెస్ట్‌గానూ పరిగణించబడుతున్నాయి. ఈ మేరకు వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కూడా అందిస్తున్నారు. దీంతో జస్ట్ డయల్‌కు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్(DCW) సమన్లు జారీ చేసింది. దీనిపై విచారణకు పోలీసులను ఆదేశించింది.
ఢిల్లీలోని పలు ‘స్పా’ సెంటర్స్‌లో గుట్టుగా ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్నారని DCWకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఈ మేరకు ‘జస్ట్ డయల్.కామ్’లో అందుబాటులో ఉన్న పలు స్పా సెంటర్లకు కాల్ చేయగా.. 24 గంటల్లో 15 కాల్స్‌తో పాటు 32 వాట్సాప్ మెసేజ్‌లు అందుకుంది. వారి సర్వీసెస్‌తో పాటు 150 మంది యంగ్ గర్ల్స్ ఫొటోలు కూడా షేర్ అయ్యాయి.
దీంతో సదరు స్పా సెంటర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్.. క్రైమ్ బ్రాంచ్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జస్ట్ డయల్ మేనేజ్‌మెంట్‌కు సమన్లు జారీ చేసిన DCW.. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. బ్యాక్ గ్రౌండ్ చెక్ లేకుండా స్పా సెంటర్ల లిస్ట్‌ను ప్రొవైడ్ చేసిన జస్ట్ డయల్.. సదరు సెంటర్ల నుంచి ఎంత మొత్తాన్ని తీసుకుందో కూడా డీటెయిల్స్ ఇవ్వాలని సూచించింది.