డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ కార్డన్ సెర్చ్.. ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్

by Shyam |
LB Nagar DCP Sunpreet Singh, cordon search
X

దిశ, జల్‌పల్లి: హైదరాబాద్‌ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరధిలోని షాహిన్ నగర్, పిర్కిమండి ప్రాంతంలో శనివారం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ కార్డన్ సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఏఆర్, ట్రాఫిక్, వజ్రా బృందాలతో పాటు 346 మంది పోలీసుల బృందం రక్షక్​వాహనాల సైరన్ మోతలు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో పీర్​కా మండి ప్రాంతంలో అలజడి సృష్టించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో పోలీసులు ఎలాంటి పత్రాలు పలు బైకులు, అనుమానితులను, ఆరుగురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్యాసింజర్ ఆటో, నిషేధించబడిన 800 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ ఏసీపీలతో పాటు బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఏఆర్, ట్రాఫిక్, వజ్రా బృందాలతో పాటు 346 మంది పోలీసుల బృందం పాల్గొ్న్నారు.

Advertisement

Next Story

Most Viewed