ఈసారి బోనాల జాతరకు భారీ బందోబస్తు : డీసీపీ

by Shyam |
DCP-Gajarao-Bhopal
X

దిశ, చార్మినార్: కరోనా థర్డ్ వేవ్‌ దృష్ట్యా ఈసారి బోనాల పండుగ భారీ బందోబస్తు మధ్య నిర్వహించడం జరుగుతుందని డీసీపీ గజారావు భూపాల్ తెలిపారు. బుధవారం లాల్ దర్వాజా మహాంకాళి ఆలయాన్ని డీసీపీ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈసారి లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఆలయ కమిటీని అడిగి తెలుసుకున్నారు. కరోనా కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆలయాల వద్ద భౌతిక దూరం పాటించడంతో పాటు క్రమ పద్దతిలో అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. భారీ బందోబస్తు మధ్య ఈసారి బోనాల జాతర నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

బోనాలు తీసుకొచ్చే మహిళలు, పురుషులకు వేరు వేరుగా క్యూ లైన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యాక్రమంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బి.బల్వంత్​ యాదవ్, లాల్​దర్వాజా ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.వెంకటేష్, ప్రధాన కార్యదర్శి మారుతీయాదవ్, కోశాధికారి అరవింద్ కుమార్ గౌడ్‌, ఫలక్‌నుమా ఏసీపీ మజీద్, ఛత్రినాక ఇన్ స్పెక్టర్ ఖాదర్ జిలాని, ఆలయ కమిటీ ​ప్రతినిధులు విష్ణుగౌడ్, కాశీనాథ్​గౌడ్, బంగార్రాజు, మారుతీ యాదవ్, లక్ష్మీనారాయణగౌడ్, సి.రాజ్​కుమార్, తిరుపతి నర్సింగ్ రావు, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story