ఫ్యాన్స్ కి షాక్.. బై సెక్సువల్ గా మారిన సూపర్‌​మ్యాన్‌ కొడుకు

by Shyam |   ( Updated:2021-10-14 02:51:35.0  )
ఫ్యాన్స్ కి షాక్.. బై సెక్సువల్ గా మారిన సూపర్‌​మ్యాన్‌ కొడుకు
X

దిశ, సినిమా : సూపర్‌మ్యాన్‌ సినిమాలకి, కామిక్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే రాబోయే తదుపరి ‘సూపర్‌​మ్యాన్‌: ది సన్‌ ఆఫ్‌ కాల్‌-ఎల్‌’ సిరీస్‌ను సరికొత్త పంథాలో తెరకెక్కించినట్లు చెబుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే క్లార్క్ కెంట్ కొడుకు జాన్ కెంట్ సూపర్‌ హీరో ‘బై సెక్సువల్స్’గా రానున్నట్లు తెలుపుతూ డీసీ కామిక్స్‌ రైటర్స్‌ ఓ పిక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సినిమా హీరోల కొడుకులు తమ వారసులగా రావడం ఎక్కడైనా జరిగేదే. కానీ ఈ వారసుడు మాత్రం నార్మల్‌గా రావట్లేదు. అదే ఇక్కడ షాకింగ్‌ విషయం. చాలా మంది ఫ్యాన్స్‌ తమ ఫేవరేట్‌ హీరోలో తమను చూసుకోవాలనుకుంటారు. కానీ ఈ సరికొత్త సూపర్‌మేన్‌ సింబల్‌ హోప్‌కి, నిజానికి, న్యాయానికి ప్రతీక నిలుస్తుంటుంది. ఈ మార్పు ఇకపై ఎక్కువ విషయాలకి ప్రతీకగా నిలువబోతోంది.

ఇకపై ‘బై సెక్సువల్స్’ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ హీరోలో తమని తాము చూసుకోబోతున్నారని’ డీసీ కామిక్స్‌ రైటర్‌ టామ్‌ టేలర్‌ వివరించాడు. కాగా విడుదల చేసిన చిత్రంలో జాన్‌ తన ప్రియుడైన రిపోర్టర్ జై నకమూరాను కిస్ చేస్తున్నాడు. అయితే ఈ విషయంపై సూపర్‌ హీరో అభిమానులు, గతంలో ఈ క్యారెక్టర్‌ చేసిన నటులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Next Story