ఓటమికి కారణాలేంటో చెప్పిన వార్నర్ 

by Shyam |   ( Updated:2020-11-08 20:43:09.0  )
ఓటమికి కారణాలేంటో చెప్పిన వార్నర్ 
X

దిశ, వెబ్ డెస్క్: ఈ సీజన్‌లో రెండు సార్లు ఢిల్లీని ఓడించామనే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. అనేక తప్పులు చేసి ఫైనల్స్ అవకాశాన్ని చేజార్చుకుంది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌కు చేరింది. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓటమిపై స్పందించారు.

https://twitter.com/IPL/status/1325500587069251585?s=20

వార్నర్ మాట్లాడుతూ.. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు జట్లు చాలా బలమైనవి. మేము మొదటి నుంచి లో ప్రొఫైల్‌లోనే ఆడుతూ వస్తున్నాము. సరైన సమయంలో రాణించి క్వాలిఫయర్స్ వరకు వచ్చాము. కానీ ఈ రోజు మేం ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లు.. ఛేదనలో కొన్ని వికెట్లు త్వరగా కోల్పోవడమే ఓటమికి కారణం. ఒక జట్టుగా మేం చాలా బలంగా ఉన్నాము. వచ్చే సీజన్‌లో అభిమానులను నిరాశ పరచమని అనుకుంటున్నాను అన్నారు.

Advertisement

Next Story