- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ గాయం మానేదెలా?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లకు కలసి రానట్లుంది. సీజన్ తొలి మ్యాచ్‌లోనే మిచెల్ మార్ష్ బౌలింగ్ చేస్తూ గాయపడి ఐపీఎల్‌కే దూరమయ్యాడు. ఇక శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 19వ ఓవర్ వేస్తూ తొల బంతి తర్వాత భువనేవ్వర్ గాయంతో విలవిల్లాడాడు. అప్పటికీ ఫిజియోతో గాయానికి ఉపశమనం ఇచ్చే స్ప్రేలు వాడినా మూడు సార్లు బౌలింగ్ వేయడానికి పరుగు తీసి వేయలేక పోయాడు. దీంతో అతడు తొలి బంతి తర్వాత మైదానాన్ని వీడాడు.
కాగా, గత కొంత కాలంగా తొడకండరాల గాయం కారణంగానే భువీ టీమ్ ఇండియాకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే గాయం తిరగబెట్టినట్లు తెలుస్తున్నది. దీంతో అతడు ముంబయి జట్టుతో జరిగే తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనేది యాజమాన్యం తేల్చి చెప్పలేకపోతున్నది. భువనేశ్వర్ కుమార్ గాయంపై ఇంకా స్పష్టత రాలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు.