- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకు లాగే కూతురికీ వారసత్వ ఆస్తి: సుప్రీం
by Anukaran |
X
న్యూఢిల్లీ: కొడుకుతో సమానంగా కూతరికీ వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. కూతురు ఎప్పటికీ కూతురేనని, కొడుకు పెళ్లయ్యేంత వరకేనని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కూతురి తన జీవితాంతం హక్కును కలిగి ఉంటుందని, తండ్రి మరణించారా? జీవించి ఉన్నారా? అనేదానితో సంబంధం లేదని స్పష్టం చేసింది.
2005లో సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం, కుటుంబ ఆస్తిలో కూతురికీ కొడుకుతో సమాన వాటా ఉంటుంది. అయితే, 2005లో సవరింపు జరిగింది గనుక, అంతకుముందు కాలానికీ ఈ చట్టం వర్తిస్తుందా? అనే పిటిషన్‌లపై ధర్మాసనం విచారించింది. 2005 ముందు కాలానికీ ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. కొడుకులాగే కూతురూ పుట్టుకతోనే కుటుంబ ఆస్తిలో హక్కుదారుగా ఉంటుందని 2018 తీర్పును సమర్థించింది.
Advertisement
Next Story