దారుణం: అత్తను చంపిన కోడలు.. పోలీసులకు ఏం చెప్పిందో తెలిస్తే షాక్

by Anukaran |   ( Updated:2021-09-10 00:09:30.0  )
దారుణం: అత్తను చంపిన కోడలు.. పోలీసులకు ఏం చెప్పిందో తెలిస్తే షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే. పెళ్లి తర్వాత భర్తను కొంగుకు కట్టేసుకొందని అత్త.. తల్లి మాటనే వింటున్నాడని కోడలు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకొంటూ ఉంటారు. ఇక ఎంత కొట్టుకున్నా అత్తాకోడళ్లు కలిసే ఉంటారు. అయితే కొన్నిచోట్ల అత్తాకోడళ్ల మధ్య వైరం.. వారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా ఒక కోడలు అత్తపై పగ పెంచుకొని దారుణంగా కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌ లో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన పత్వారి రమేష్ అనే వ్యక్తికి, అదే గ్రామానికి చెందిన బాహూ రేఖ అనే మహిళతో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది.పెళ్లైన కొద్దిరోజులు బాగానే ఉన్నా, ఆ తరువాత వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో భార్య రేఖ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త రమేష్, తన చెల్లి, తల్లితో కాకుండా అదే గ్రామంలో మరి ఇంటిలో ఒంటరిగా నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలోనే పుట్టింటికి వెళ్లిన తన గురించి అత్త బాబూదేవి అందరికి లేనిపోనివన్నీ చెప్తోందని రేఖ ఆమెపై పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం అత్త ఇంటికి వెళ్లిన కోడలు ఆమెపై కర్రలతో దాడిచేసింది. అత్త తప్పించుకోవడానికి ప్రయత్నించినా వదలకుండా పరిగెత్తి మరి దారుణంగా కొట్టి చంపింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా కొట్టేందుకు ప్రయత్నించగా రేఖను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. అత్త మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కోడలిని అరెస్ట్ చేశారు.

ఇక గురువారం కోడలు రేఖను విచారించిన పోలీసులు ఆమె మాటలు విని అవాక్కయ్యారు. అత్తను చంపినందుకు ఏమాత్రం పశ్చాతాపం వ్యక్తం చేయకుండా.. పీడ పోయింది అంటూ నవ్వుతు చెప్పడం షాక్ కి గురిచేసింది. భర్తతో విడిపోవడం, ఒంటరితనంతో మిగిలిపోవడంతో ఆమె మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందోని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, రేఖను కోర్టులో హాజరుపరచనున్నారు.

Advertisement

Next Story