గాల్లో వేలాడిన రైతు మృతదేహం.. కొడుకు లేని ఆ తండ్రికి కూతురే దగ్గరుండి..!

by Sumithra |
గాల్లో వేలాడిన రైతు మృతదేహం.. కొడుకు లేని ఆ తండ్రికి కూతురే దగ్గరుండి..!
X

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెట్టు పైకి ఎక్కి ఓ రైతు తాడుతో ఉరేసుకున్నాడు.ఈ ఘటన జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. చౌడం స్వామి (53) అనే రైతుకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. అంతేకాకుండా నిత్యం సిద్దిపేటకు కూలి పనికి వెళ్తుండేవాడు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగా రాలేదు. కూలి పని చేసి కుటుంబాన్ని పోషించడం స్వామికి భారంగా మారింది. దీనికి తోడు అప్పులు పెరిగిపోయాయి. అవి తీర్చలేక నానా తంటాలు పడ్డాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్న గ్రామస్తులు చెట్టుకు వేలాడుతున్న స్వామిని మృతదేహాన్ని చూశారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

విషయం తెలియడంతో బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడికి ఒక్కతే కూతురు. పేరు లక్ష్మి. తండ్రికి తల కొరివి పెట్టేందుకు కొడుకు లేని లోటను కూతురే తీర్చింది. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో భార్య, కూతురు రోడ్డున పడ్డారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story