- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నితీష్ కుమార్ రెడ్డి తండ్రి భావోద్వేగం.. స్పందించిన నారా భువనేశ్వరి
దిశ,వెబ్‌డెస్క్: తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nithish Kumar reddy) ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన సెంచరీ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం మూడో రోజు మ్యాచ్ అనంతరం నితీశ్‌ను అతని తల్లిదండ్రులు, సోదరి హోటల్‌కు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య భావోద్వేగాలు ఉప్పొంగాయి. దీనికి సంబంధించిన వీడియోను BCCI పోస్ట్ చేయగా దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) స్పందించారు.
కుటుంబ సభ్యుల మధ్య మధుర క్షణాలను ఈ అందమైన వీడియోలో కనిపిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. ‘‘మన యువ తార నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీ పట్ల అందరం గర్విస్తున్నాం. అతడు సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. తన కుటుంబాన్ని గర్వించేలా చేశాడు. బిడ్డ కలను నిజం చేయడానికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ప్రతి దశలోనూ తోడుగా ఉన్న అతని తల్లిదండ్రులకు శుభాభినందనలు. నితీష్ కుమార్ రెడ్డి విజయం దేశానికే గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ నారా భువనేశ్వరి పేర్కొన్నారు.