Ap News: రాష్ట్రంలో న్యూ ఇయర్ రోజు తీవ్ర విషాదం

by srinivas |   ( Updated:2025-01-01 12:49:50.0  )
Ap News: రాష్ట్రంలో న్యూ ఇయర్ రోజు తీవ్ర విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ బీచ్‌లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. సముద్రం(Sea)లో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వెంటనే నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టంకు తరలించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు విశాఖ రుషికొండ ఐటీ సెజ్ బీచ్‌(Visakha Rushikonda IT SEZ Beach)లోనూ విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన రాయపూర్ వాసి కనోజ్ మృతి చెందారు. న్యూ ఇయర్(New Year) సందర్భంగా రామకృష్ణాపురానికి చెందిన నలుగురు విద్యార్థులు సముద్రంలో ఈతకు వెళ్లారు. అయితే అలల ఉధృతికి గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారు. మరో వ్యక్తి మృతి చెందారు.

Advertisement

Next Story