డేటింగ్ యాప్ ముఠా అరెస్ట్

by Anukaran |   ( Updated:2020-10-13 08:07:45.0  )
డేటింగ్ యాప్ ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్ :
డేటింగ్ యాప్ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కోల్‎కతాలో ఉన్న కాల్‎సెంటర్‎పై మంగళవారం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో ఆనంద్ కర్, బుద్దపాల్‎ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ల్యాప్‎టాప్స్, 24 మొబైల్ ఫోన్లు, 51 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డినట్లు గుర్తించారు. మరోవైపు 16 మంది యువతులకు 41 సీఆర్పీ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story