బిగ్ బ్రేకింగ్: యాదాద్రి పున:ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ప్రకటించిన కేసీఆర్

by Anukaran |   ( Updated:2021-10-19 09:15:03.0  )
బిగ్ బ్రేకింగ్: యాదాద్రి పున:ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ప్రకటించిన కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మాణం చేస్తోన్న యాదాద్రి ఆలయం చివరి దశకు చేరుకుంది. ఈక్రమంలో నూతన ఆలయ ప్రారంభోత్సవం ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తోన్న రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. మంగళవారం సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అంతేగాకుండా ఏరియల్ వ్యూ ద్వారా పునర్ నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో విశిష్ట పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం ఒకటని అన్నారు.

ఈ క్రమంలో చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆలయ పునర్ నిర్మాణ పనులు మొదలు పెట్టామని చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తవుతున్న క్రమంలో ప్రారంభోత్సవంపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. అంతేగాకుండా భక్తుల సౌకర్యార్థం 250 కాటేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రసిద్ధ వ్యక్తులు వచ్చినప్పుడు ఉండేందుకు ప్రెసిడెన్షియల్ సూట్స్ కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 1500 మంది భక్తులుండేందుకు కావాల్సిన ధర్మశాలలను అందుబాటులో ఉంచామన్నారు. మహా సుదర్శన హోమానికి రుత్వికులు 5 నుంచి 6 వేల మంది అవసరం ఉందని, సహాయకులు కూడా మరో 3 నుంచి 4 వేల మంది అవసరమని వెల్లడించారు. హోమానికి కావాల్సిన లక్షా యాభైవేల కిలోల నెయ్యిని కూడా సమీకరిస్తామన్నారు. ఆలయ పునర్ ప్రారంభంతో పాటు మహా సుదర్శన యాగం తేదీలను సీఎం ప్రకటించారు. నూతన ఆలయాన్ని వచ్చే ఏడాది మార్చి 28న మహకుంభ సంప్రోక్షణతో వైభవంగా పునర్ ప్రారంభించి, దానికి 9 రోజుల ముందు మహాసుదర్శన యాగంతో అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు.

యాదాద్రిలో మొదటి దాతగా కేసీఆర్.. ఏం ఇస్తున్నాడో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed