- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హుజురాబాద్ యువ నేత కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 14న టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోనుండగా.. 16న తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోగా.. 16న కౌశిక్ రెడ్డితో పాటు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కౌశిక్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ కౌశిక్ రెడ్డి ఆశిస్తుండగా.. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఆయన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీంతో కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. మంత్రి కేటీఆర్‌ను కలవడం, హుజురాబాద్ టీఆర్‌ఎస్ టికెట్ తనకేనంటూ ఆయన మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ కావడంతో కాంగ్రెస్‌లో టికెట్ దక్కే ఛాన్స్ లేదు.
ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈటల టీఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోవడంతో ఆ పార్టీకి హుజురాబాద్‌లో సరైన అభ్యర్ధి కరువయ్యారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై సీఎం కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హుజురాబాద్ టీఆర్‌ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డికి వస్తుందా? లేదా? అనేది చూడాలి.