- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాక్, చైనాలతో యుద్ధానికి డేట్ ఫిక్స్..?
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, చైనాలతో యుద్ధానికి డేట్ ఫిక్స్ అయిందని, ప్రధాని మోడీ తేదీలను నిర్ణయించారని అన్నారు. రామ మందిరం, ఆర్టికల్ 370 నిర్వీర్యంలాంటి నిర్ణయాల్లాగే పాకిస్తాన్, చైనాలతో యుద్దానికి తేదీలనూ ప్రధాని నిర్ణయించారని వివరించారు. దానికి సంబంధించిన తిథిని ఇప్పటికే నిర్ణయించారని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యూపీ బలియా జిల్లా సికందర్‌పుర్ నియోజకవర్గంలో క్రిష్ణుడి ఆలయానికి భూమి పూజ చేయడానికి వెళ్లిన సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ, బీఎస్‌పీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజల అంచనాలను అందుకోలేదని విమర్శించారు. వారిని తీవ్రవాదులతో పోల్చారు. పార్టీ వర్కర్లలో ఉత్సాహాన్ని నింపడానికి ఈ వ్యాఖ్యలు చేశారని స్థానిక బీజేపీ ఎంపీ రవీంద్ర కుశ్వాహా వివరణ ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యంగ్యంగా స్పందించారు. ‘పేరు చెప్పడానికే నిరాకరించే ప్రధాని మోడీ యుద్ధానికి తేదీలను నిర్ణయించారంటరూ’అంటూ ట్వీట్ చేశారు.