వైద్య ఆరోగ్యశాఖ సేవలు చిరస్మరణీయం

by Sampath |

దిశ, వరంగల్: కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం కృషి చేస్తోందని, వారి సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. శుక్రవారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 250 మంది వైద్య సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుటుంబాలకు దూరంగా ఉండి ప్రాణాలకు తెగించి ప్రజల కోసం కృషి చేస్తున్నా వైద్యులకు వారి సిబ్బందికి అండగా నిలుస్తామన్నారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఏ ఒక్కరూ కూడా గడప దాటి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన సూచించారు.

Tags: Dasyam Vinay Bhaskar, Distribution, Essentials, Department of Medical Health, warangal

Advertisement

Next Story