ఆన్‌లైన్‌లో ఖైరతాబాద్ గణేషుడి దర్శనం.. డీటెయిల్స్ ఇవే

by Anukaran |   ( Updated:2020-08-21 03:02:21.0  )
ఆన్‌లైన్‌లో ఖైరతాబాద్ గణేషుడి దర్శనం.. డీటెయిల్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం ఉండబోదన్న వారికి శుభవార్త. ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అయితే, ఈసారి మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా దర్శనమివ్వనున్నారు. అదేలాగు అంటే… ఆన్ లైన్ లో దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం వినాయక కమిటీ ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్ సైట్ ద్వారా ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలిసింది. అంతేకాదు.. ఈ వెబ్ సైట్ ద్వారా భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకునే అవకాశం కల్పించనున్నట్లు కూడా సమాచారం.

Advertisement

Next Story