- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ బోర్డులో ఇష్టారాజ్యం.. కోట్లలో నష్టం
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్బోర్డులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అఫిలియేషన్లేకున్నా కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహిస్తున్నా అధికారులు తమకేం పట్టదనట్లు చూసీచూడనట్లు గాలికొదిలేస్తున్నారు. కాలేజీలు నిర్వహించాలంటే సాధారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు ఎవరైనా సరే పాటించాల్సిందే. కానీ ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇటీవల నిబంధనలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 65 కాలేజీలకు నోటీసులు సైతం పంపింది. కాగా అందులో 20 కాలేజీలను సంబంధిత యాజమాన్యాలు మరో ప్రాంతానికి షిఫ్ట్చేసుకున్నాయి. మిగిలిన 45 కళాశాలలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అలాగే కొనసాగుతున్నాయని తెలంగాణ ఇంటర్పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడిస్తున్నారు. హైకోర్టు నిబంధనలను సైతం పలు కాలేజీలు బేఖాతరు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
నిబంధనలు పాటించని యాజమాన్యాలకు ప్రతి సెక్షన్‌కు రూ.లక్ష చొప్పున, అలాగే ఆ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులుంటే ఒక్కొక్కరిపై రూ.1000 చొప్పున యాజమాన్యాలపై జరిమానా విధించాల్సి ఉన్నా అలాంటి చర్యలేమీ చేపట్టకపోవడంతో బోర్డు కోట్లలో ఆదాయం కోల్పోతోంది. ఇదిలా ఉండగా ఇంటర్ కాలేజీలు ఒక మండలం నుంచి మరో మండలానికి జూనియర్ కాలేజీని షిఫ్ట్ చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే విద్యార్థుల నుంచి అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. కానీ అలాకాకుండా బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విద్యా సంవత్సరం బోర్డు కోట్లలో ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని తెలంగాణ ఇంటర్ పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణ ఇంటర్ పరిరక్షణ సమితి సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక ప్రైవేట్ యాజమాన్యాలు చెప్పడంతో అడ్మిషన్ తేదీలను పొడిగించడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే, బోర్డు మీటింగ్ కూడా నిర్వహించకుండానే కొందరు అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని డబ్బులను సొంత ఖర్చులకు వాడుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ లో వరదలు వచ్చిన నేపథ్యంలో వరద సాయం పేరుతో ఇంటర్ బోర్డులోని ఒక అధికారి తన సొంత నివాసంలో విద్యుత్ పనుల కోసం లక్షల రూపాయలు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినప్పటికీ సమాధానం రాలేదని తెలంగాణ ఇంటర్ పరిరక్షణ సమితి సభ్యులు చెబుతున్నారు. ఇలా అన్యాయంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఇంటర్ బోర్డు వైఖరిపై వారు ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు
అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి
జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలి. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకొని పేద విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలి. అఫిలియేషన్ మంజూరు చేయకున్నా నిర్వహిస్తున్న కాలేజీల అఫిలియేషన్ రద్దు చేయాలి. బోర్డు అధికారులు నిర్లక్ష్యం వీడి విధులు సక్రమంగా నిర్వర్తించాలి. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలి- రామకృష్ణ, తెలంగాణ ఇంటర్‌బోర్డు పరిరక్షణ సమితి కన్వీనర్
- Tags
- inter board