పేదరికంలో మగ్గిపోతున్న దళితులు : ఈటల

by Sridhar Babu |
పేదరికంలో మగ్గిపోతున్న దళితులు : ఈటల
X

దిశ, జమ్మికుంట: స్వాతంత్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దళిత జాతి ఇంకా పేదరికంలోనే మగ్గిపోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని నివాసంలో జాతీయపతాక ఆవిష్కరణ చేసి, మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్య్రం సిద్దించిన తరువాత అనేక మార్పులు, అనేక రకాల అభివృద్ది పనులు జరిగినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేదరికం అలాగే ఉందన్నారు. రాబోయే కాలంలో దేశం మరింత సుసంపన్నం కావాలని, ఆ సంపద పేద ప్రజల ఆకలి తీర్చి, పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ దేశం మరింత సమైక్యంగా, దేశభక్తితో ముందుకు సాగాలని, అందరూ చల్లగా జీవించాలని ఆకాంక్షిస్తున్నానని ఈటల వివరించారు.

Advertisement

Next Story

Most Viewed