- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలి – ఎమ్మెల్యే సీతక్క
దిశ,ములుగు : దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, పీసీసీ అధ్యక్షుడు దళిత దండోరా కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతీ తెలిసిందే. అందులో భాగంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి పిలుపు మేరకు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవిచందర్ ఆధ్వర్యంలో ఒకరోజు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని శనివారం ములుగు జిల్లా కేంద్రం లో నిర్వహించారు.
ఈ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క, మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులను, గిరిజనులను మోసం చేయడం కోసం, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలువడం కోసమే దళిత బంధు పథకాన్ని ప్రకటించారే తప్ప, దళితుల కోసం కాదని సీతక్క విమర్శించారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి దళితులపై ప్రేమ ఉంటే దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలని, రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి, ఆయా సామాజిక వర్గాల వారీగా, బీసీ వర్గాల అయితే, బీసీ బంధుగా, మైనార్టీల వారికి మైనార్టీ బంధుగా, గిరిజనలకు గిరిజన బంధుగా రాష్ట్ర మంతటా అందరి బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాంధ్ పాషా గారు, సర్పంచ్‌లు రత్నం భద్రయ్యా, సర్పంచ్ భద్రయ్యా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చెరుకుపెల్లి శ్రీకాంత్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు జక్కుల రేవంత్ యాదవ్, బొమ్మకంటీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.