దినసరి కూలీకి 2.5 లక్షలకు నోటీసు

by Harish |
దినసరి కూలీకి 2.5 లక్షలకు నోటీసు
X

కోటిన్నర లావాదేవీలకు 2.5 లక్షల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాలన్న ఐటీ డిపార్ట్ మెంట్ ఆదేశాలతో దినసరి కూలీ బెంబేలెత్తిపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని నవరంగ్ పూర్ జిల్లాలో సనధారా గంద్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2014-15లో ఈ వ్యక్తి రూ. 1.47 కోట్ల లావాదేవీలను నిర్వహించాడని… ఈ నేపథ్యంలో రూ. 2.59 లక్షల పన్నును చెల్లించాలంటూ ఆదాయపుపన్ను శాఖ నుంచి అతనికి నోటీసులు అందాయి.

దీంతో సనధారా గంద్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. కూలి పనులు చేసుకునే తాను ఈ మొత్తాన్ని ఎలా చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేశాడు. పప్పూ అగర్వాల్ అనే వ్యక్తి ఇంట్లో ఏడేళ్ల పాటు పని చేశానని… ఆ సమయంలో తన భూమి పట్టాతో పాటు తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చానని… పప్పూ యాదవ్ తనను మోసం చేశాడని సనధారా గంద్ వాపోయాడు. ఆయన ఏదో చేయబట్టే తనకు నోటీసులు వచ్చాయని కన్నీటిపర్యంతమయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed