మాకు సంబంధం లేదు : దగ్గుబాటి ఫ్యామిలీ

by Shyam |   ( Updated:2020-08-13 05:13:07.0  )
మాకు సంబంధం లేదు : దగ్గుబాటి ఫ్యామిలీ
X

దగ్గుబాటి వారసుడు అభిరామ్‌పై ఇప్పటికే నెగెటివ్ టాక్ ఉంది. తాజాగా అభిరామ్ వల్ల ఓ కారు ప్రమాదం జరిగిందంటూ మీడియాలో ప్రచారం జరగ్గా.. ఈ విషయంపై దగ్గుబాటి ఫ్యామిలీ క్లారిటీనిచ్చింది. అభిరామ్ అసలు ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదని స్పష్టం చేసింది.

కరీంనగర్ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి, కొత్తగా కారు కొనుగోలు చేసి స్నేహితుడితో కలిసి టెస్ట్ డ్రైవ్‌కు వెళ్ళాడు. పంచవటి కాలనీ నుంచి మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ వైపు వెళ్లగా అదే సమయంలో అటుగా వచ్చిన దగ్గుబాటి అభిరామ్ కారు.. ఈ కారును ఢీకొందని మీడియాలో ప్రచారం జరిగింది. సీసీ టీవీ ఫుటేజీ కూడా ఉందని న్యూస్ టెలికాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి కారు బాగా డ్యామేజ్ అయిందని న్యూస్ రాగా.. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు దగ్గుబాటి కుటుంబీకులు.

కారు ప్రమాదానికి, అభిరామ్‌కు సంబంధమే లేదని, అసలు ఆ కారు తమకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు నమ్మకూడదని, దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాను కోరారు.

Advertisement

Next Story