మహిళా లెక్చరర్‌ను మోసం చేసిన ఘనుడు

by Sumithra |   ( Updated:2021-12-06 08:20:26.0  )
Cyber Crime
X

దిశ, కుత్బుల్లాపూర్:ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నమ్మించి నట్టేట ముంచుతున్నారు. కస్టమర్ కేర్ అని, బ్యాంక్ నుంచి అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఓ మహిళా లెక్చరర్‌ను ఓ సైబర్ నేరగాడు డబ్బులు నొక్కేశాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఐ రాజు సోమవారం వెల్లడించారు.

మైసమ్మ గూడలోని మల్లారెడ్డి కళాశాలలో లెక్చరర్‌గా పని చేసే శ్వేతకు గత నెల 26వ తేదీన గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. మీ జియో టీఎం డాక్యుమెంట్ గడువు ముగిసిందని, కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేయాలని అపరిచిత వ్యక్తి తెలిపారు. అతనిచ్చిన నెంబర్‌కు ఫోన్ చేయగా కేవైసీ నంబర్ అడిగి తీసుకున్నారు. ఎనీ డెస్క్ ఓపెన్ చేయమని లెక్చరర్‌ను కోరాగా.. ఆమె వెంటనే కనెక్ట్ చేసింది. ఛార్జ్ పేరిట రూ.10లు కట్ అయ్యాయి. ఆ వెంటనే ఐఎఫ్ఎస్సీ కోడ్ చెప్పగా అందులో నుంచి రూ.10 వేలు డెబిట్ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన లెక్చరర్‌గా శ్వేత పోలీసులను ఆశ్రయించింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed