ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా గుట్టురట్టు

by Sumithra |
ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా గుట్టురట్టు
X

దిశ, న్యూస్ బ్యూరో: నగరంలోని పలు రెస్టారెంట్లు, పబ్బులలో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.10లక్షల నగదుతో పాటు స్కిమ్మర్, క్లోనింగ్ మిషన్, 44 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా 140 కార్డులను క్లోనింగ్ చేసి, రూ.30 లక్షలు విత్ డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేవలం పదో తరగతి వరకే చదివిన ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు ప్రఫుల్ కుమార్.. స్కిమ్మర్, క్లోనింగ్ మిషన్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. అనంతరం కొందరితో ముఠాగా ఏర్పడ్డారు. వీరు హైక్లాస్ రెస్టారెంట్లు, పబ్‌లలో వెయిటర్లుగా చేరి, కస్టమర్లు బిల్లులు చెల్లించేటప్పుడు తమవెంట తెచ్చుకున్న స్కిమ్మర్ సహాయంతో కార్డులోని డేటాను తస్కరించి, అందులోని డబ్బులు కాజేస్తారు. అలాగే, వీరు ఒకే రెస్టారెంట్, పబ్బులలో 10రోజులకు కన్నా ఎక్కువ పనిచేశారు. కాగా, ఈ ఘటన గచ్చిబౌలిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

tags: atm cloning, skimmer, cloning mission, cyberabad police, hdfc bank manager, atm cards

Advertisement

Next Story

Most Viewed