‘ఆ తర్వాతే బండి సంజయ్‌పై చర్యలు’

by Shyam |   ( Updated:2020-11-30 11:06:44.0  )
‘ఆ తర్వాతే బండి సంజయ్‌పై చర్యలు’
X

దిశ, క్రైమ్ బ్యూరో : డీజీపీ, పోలీసు శాఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై లీగల్ ఓపీనియన్ అనంతరం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి కారును పోలీసులు కేపీహెచ్‌బీ వద్ద తనిఖీ చేసిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం కుమ్మక్కు అయినట్టు సంచనల వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్లు డబ్బులు పంపిణీ చేస్తున్నా.. ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడానికి పోలీసులు భయపడుతున్నారని విమర్శించారు. అంతే కాకుండా, డీజీపీ మహేందర్ రెడ్డికి మంచి అధికారిగా పేరుందని, పోస్టులు శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు రోడ్డు ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఈ విషయంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలపై లీగల్ ఓపీనియన్ తీసుకుంటామని, అనంతరం చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ అన్నారు.

Advertisement

Next Story